Telugu Global
Telangana

ఓటర్ లిస్ట్‌లో మీ పేరుందా? ఇలా చెక్ చేసుకోండి!

దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఓటరు.. ఓటర్ లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిదని ఎలక్షన్ అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ లిస్ట్‌లో పేరు లేకపోతే వెంటనే అప్లై చేసుకోవచ్చు.

ఓటర్ లిస్ట్‌లో మీ పేరుందా? ఇలా చెక్ చేసుకోండి!
X

ఓటర్ లిస్ట్‌లో మీ పేరుందా? ఇలా చెక్ చేసుకోండి!

దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఓటరు.. ఓటర్ లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిదని ఎలక్షన్ అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ లిస్ట్‌లో పేరు లేకపోతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. అదెలాగంటే..

ఓటు వేయాలంటే కేవలం ఓటర్ ఐడీ ఉంటే సరిపోదు. ఓటరు జాబితాలో పేరు కూడా ఉండాలి. చివరి నిముషంలో ఓటు వేయలేక ఇబ్బంది పడకూడదంటే.. ముందుగానే ఓటర్ జాబితాను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

ఇలా చెక్ చేయొచ్చు

ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసేందుకు తెలంగాణ ఓటర్ సర్వీస్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ (https://ceotelangana.nic.in) లోకి వెళ్లాలి. తర్వాత హోమ్ పేజీలో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ (Search Your Name)’పై క్లిక్ చేసిఅసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సెలక్ట్ చేసుకొని.. మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేసి, లాస్ట్‌లో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. సెర్చ్ చేయగానే మీ వివరాలు వస్తే.. ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నట్టు. ఒకవేళ మీ వివరాలు లేవని డిస్‌ప్లే అయితే వెంటనే మీ వివరాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్ ఇలా..

ఓటర్ లిస్ట్ లో మీ వివరాలు లేకపోతే.. ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అఫీషియల్ వెబ్‌సైట్( https://voters.eci.gov.in) లోకి వెళ్లి ముందుగా మీ ఫోన్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకొని లాగిన్‌ అవ్వాలి. ‘రిజిస్టర్‌ యాజ్‌ ఏ న్యూ ఓటర్‌’ అని ఆప్షన్‌ పై క్లిక్‌ చేస్తే ‘ఫార్మ్-6.. అప్లికేషన్‌ ఫార్మ్ ఫర్‌ న్యూ ఓటర్‌’ అని వస్తుంది. దానిపై క్లిక్‌ చేసిన తర్వాత ఆన్‌లైన్‌ అప్లికేషన్ కనిపిస్తుంది. అందులో వివరాలన్నింటినీ నింపి సబ్మిట్‌ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ ఫోన్‌ నంబర్‌కు రిఫరెన్స్‌ ఐడీ నంబర్‌ వస్తుంది. ఆ తర్వాత బూత్‌ లెవల్ అధికారి మీ అడ్రెస్‌కు వచ్చి వివరాలు పరిశీలిస్తారు. వివరాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఓటరు జాబితాలో మీ పేరు చేర్చుతారు.

ఇకపోతే ఈ పోర్టల్‌లో కూడా ఓటర్ వివరాలు సెర్చ్ చేయొచ్చు. వెబ్‌సైట్‌ హోమ్ పేజీలో ‘సెర్చ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌’ పై క్లిక్ చేసి, మీ ఫొటో గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్‌ చేయాలి. జాబితాలో మీ పేరు ఉందా? లేదా? ఏ పోలింగ్‌ సెంటర్ పరిధిలో ఉంది? సీరియల్‌ నెంబర్‌ ఎంత? వంటి వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ గుర్తింపు కార్డు నెంబర్ తెలియకపోతే ‘అడ్వాన్స్‌ సెర్చ్‌’ లోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు వంటి వివరాలు ఎంటర్ చేసి కూడా ఓటరు లిస్ట్‌ను చెక్ చేసుకోవచ్చు.

First Published:  11 Oct 2023 5:12 PM IST
Next Story