భగ్గుమంటున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?
బంగారం ప్రియులకు భారీ షాక్ తగిలింది. శుక్రవారం తగ్గిన పసిడి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి
BY Vamshi Kotas28 Sept 2024 4:27 AM GMT
X
Vamshi Kotas Updated On: 28 Sept 2024 4:29 AM GMT
పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. శుక్రవారం తగ్గిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. భారత దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 77, 460 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 71, 010 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 పెరిగి రూ. 1,02,100 గా నమోదు అయింది.
Next Story