Telugu Global
Telangana

మూసీని అడ్డం పెట్టుకుని ఎంత కాలం బతుకుతారు?

కుటుంబ డిజిటల్‌ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్‌, హరీశ్ లపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

మూసీని అడ్డం పెట్టుకుని ఎంత కాలం బతుకుతారు?
X

కేసీఆర్‌ అధికారంలో ఉంటే రేషన్‌కార్డులు రావని.. ప్రజలు మాకు అధికారం ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లో కుటుంబ డిజిటల్‌ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నాం. సికింద్రాబాద్‌ నుంచే కార్యక్రమం ప్రారంభించాం. మహిళలే కుటుంబ పెద్దగా డిజిటల్‌ కార్డు పంపిణీ చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ తీసుకురావాలనే కుటుంబ డిజిటల్‌ కార్డులు ఇవ్వాలని ఆలోచించాం. రేషన్‌కార్డు కోసం ప్రజలు పదేళ్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. కొత్త కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు కుటుంబానికి రక్షణ కవచం అని సీఎం తెలిపారు.

పేదలకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నారు కదా. రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో రూ. 1500 కోట్లు ఉన్నాయి. ఒక రూ. 500 కోట్లు మూసీ ముంపునకు గురైన వారికి పంచిపెట్టండి. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ రోజు సూచనలు ఎందుకు ఇవ్వలేదు? అని సీఎం ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంత పేదలకు 15 వేల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చాం. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుంది? అని సీఎం ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం.. వచ్చి సలహాలు ఇవ్వండి అన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫామ్‌హౌస్‌లు కూల్చాలా వద్దా? చెప్పండి అన్నారు. ఫామ్‌హౌస్‌లు కూల్చుతారనే పేదలను అడ్డం పెట్టుకుని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎంత కాలం బతుకుతారు? హైదరాబాద్‌లో మీ భరతం పడతాం అని సీఎం హెచ్చరించారు.

కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ మీకు మోదీ చేపట్టిన సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ కావాలి. కానీ మూసీ రివర్‌ ఫ్రంట్‌ వద్దా? అని నిలదీశారు. కిరాయి మనుషులతో కేటీఆర్‌, హరీశ్‌రావు హడావుడి చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న నగరాన్ని కాపాడుకుందామన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు సచివాలయానికి రండి.. నాలుగు రోజులు చర్చిద్దామన్నారు.ఈ ప్రభుత్వం పేద కన్నీళ్లు చూడదలుచుకోలేదని , మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సూచనలు ఇవ్వండి అని సీఎం కోరారు.

First Published:  3 Oct 2024 1:13 PM IST
Next Story