మండలి చీఫ్ విప్‌గా పట్నంను ఎలా నియమిస్తారు?
ఛైర్మన్ ఇచ్చిన బులెటిన్ అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చిందని, దీన్నికూడా అనర్హత పిటిషన్‌లో సాక్ష్యంగా చేరుస్తామన్న మాజీ మంత్రి హరీశ్‌రావు
మండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని ఎలా నియమిస్తారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని చెప్పడానికి ఇదో ఉదాహరణ అన్నారు. పీఏసీ ఛైర్మన్ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్‌కు చెందిన మహేందర్‌రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారు? ఆయనపై అనర్హత పిటిషన్ ఛైర్మన్ వద్ద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నది. ఛైర్మన్ ఇచ్చిన బులెటిన్ (మండలి చీఫ్ విప్‌గా నియమించడం) అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చింది. దీన్నికూడా అనర్హత పిటిషన్‌లో సాక్ష్యంగా చేరుస్తామన్నారు. ఎమ్మెల్సీ హోదాలోనే ఆగస్టు 15, సెప్టెంబర్ 17న మహేందర్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. మార్చి 15 నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ అని బులిటెన్‌లో ఇచ్చారు. దీనిపై సీఎస్‌కు లేఖ రాస్తాం. గవర్నర్, డీవోపీటీకి కూడా లేఖ రాస్తామన్నారు.ఈ విషయంలో గవర్నర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ ఆరోపించారు.