Telugu Global
Telangana

ప్రాజెక్టు పనులకు అనుమతులు లేకుండానే టెండర్లు ఎలా పిలుస్తారు?

కాళేశ్వరంపై కమిషన్‌ వేశారు. ఇప్పుడు మీపై ఏ కమిషన్‌తో విచారణ చేయించాలని ప్రశ్నించిన కేటీఆర్‌

ప్రాజెక్టు పనులకు అనుమతులు లేకుండానే టెండర్లు ఎలా పిలుస్తారు?
X

సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు అనుమతులు లేకుండానే టెండర్లు ఎలా పిలుస్తారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. కోటి ఎకరాలకు నీళ్లందిస్తున్న కాళేశ్వరంపై కమిషన్‌ వేశారు. ఇప్పుడు మీపై ఏ కమిషన్‌తో విచారణ చేయించాలని ధ్వజమెత్తారు. మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మట్టి కొట్టిందని.. రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై కాంగ్రెస్‌ సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయనీ.. కానీ కాంగ్రెస్‌ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండాపోయాయని ఆరోపించారు. మూసీ మురికిలో రూ. కోట్లు కుమ్మరించడంపై ఉన్న ప్రేమ.. జలాశయాల్లో జలపుష్పా (చేపలు)లను వదలడంలో లేదని విమర్శించారు. ఉపాధి లేక బోసిపోయిన బెస్తవాడలపై, వారి దీనస్థితిపై ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని పోస్టులో పేర్కొన్నారు.

First Published:  3 Nov 2024 8:17 PM IST
Next Story