Telugu Global
Telangana

రాష్ట్రంలో కులగణన చారిత్రకం : సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో కులగణన సర్వే అభిప్రాయ సేకరణ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రంలో కులగణన చారిత్రకం : సీఎం రేవంత్‌రెడ్డి
X

తెలంగాణలో కులగణన చారిత్రకం కాబోతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బోయినపల్లిలోని ఐడియాలజీ సెంటర్ లో మేధావులు, బీసీ సంఘాల సదస్సులో ఆయన మాట్లాడారు. సామాన్య ప్రజల నుంచి సలహాలు తీసుకోవడానికి రాహుల్‌గాంధీ నేరుగా రాష్ట్రానికి రావడం గొప్ప విషయమని కొనియాడారు. కులగణన విషయంలో రాహుల్‌కు ఇచ్చిన మాట నెరవేర్చడమే తమ కర్తవ్యమని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బీసీకు అందాల్సిన రిజర్వేషన్లు కులగణనతో అందిస్తామని స్పష్టం చేశారు. 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ఎంతో మందిని కదిలించిందన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో గరీబ్ హఠావో అనే నినాదంలో చరిత్రలో నిలిచారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ మాట ఇస్తే అది శాసనమని ముఖ్యమంత్రి తెలిపారు.

First Published:  5 Nov 2024 8:42 PM IST
Next Story