రాజా సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను నాశనం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది... హిందూత్వవాచ్
ద్వేషపూరిత ప్రసంగాలపై ధిక్కార పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన మూడు రోజులకే కేంద్రం నుండి ట్విట్టర్ కు అభ్యర్థన వచ్చిందని సంస్థ తెలిపింది. హిందూత్వవాచ్ డాక్యుమెంట్ చేసిన రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగాలను పిటీషన్ విస్తృతంగా ప్రస్తావించింది. ఇప్పుడు కేంద్రం దానిని తొలగించాలని కోరుతోంది.
భారతదేశంలోని మతపరమైన మైనారిటీల సభ్యులపై దాడుల నివేదికలను పర్యవేక్షించే పరిశోధనాత్మక సంస్థ హిందూత్వవాచ్, గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగాల ఐదు వీడియోల సాక్ష్యాలను తమ ట్విట్టర్ హ్యాండిల్ నుండి తొలగించడం ద్వారా కేంద్రం సాక్షాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని శుక్రవారం తెలిపింది. .
ద్వేషపూరిత ప్రసంగాలపై ధిక్కార పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన మూడు రోజులకే కేంద్రం నుండి ట్విట్టర్ కు అభ్యర్థన వచ్చిందని సంస్థ తెలిపింది. హిందూత్వవాచ్ డాక్యుమెంట్ చేసిన రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగాలను పిటీషన్ విస్తృతంగా ప్రస్తావించింది. ఇప్పుడు కేంద్రం దానిని తొలగించాలని కోరుతోంది.
హిందూత్వవాచ్ కు ట్విటర్ నుండి విత్‌హోల్డింగ్ నోటీసువచ్చింది. “పారదర్శకత దృష్ట్యా, మీ ట్విట్టర్ ఖాతా @ HindutvaWatchin లోంచి పోస్టులను తీసివేయాలని భారత ప్రభుత్వం నుండి Twitter కు డిమాండ్ వచ్చింది. ఆ కంటెంట్ భారతదేశ సమాచార సాంకేతిక చట్టం, 2000ని ఉల్లంఘిస్తుంది.'' అని నోటీసులో పేర్కొంది.
గత ఏడాది మహ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింది. ఇదే కేసులో అతడిని అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు. అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సింగ్‌ను విడుదల చేశారు. అయితే భవిష్యత్తులో వర్గాల మధ్య ద్వేషాన్ని సృష్టించే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సింగ్ కు హెచ్చరిక చేసింది.
ఇటీవల, ముంబై పోలీసులు రాజా సింగ్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153(ఎ) (మతం, జాతి, జన్మస్థలం, నివాసం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మొన్న శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ తీసిన శోభాయాత్రలో మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే ఫోటోలను ప్రదర్శిస్తూ డ్యాన్సులుచేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా రాజాసింగ్ రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు.