అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద హైటెన్షన్.. ముస్లిం నేతల ఆందోళన
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంపై అర్ధరాత్రి గాంధీభవన్ వద్ద ముస్లిం నేతల నిరసన వ్యక్తం చేశారు.
BY Vamshi Kotas10 March 2025 11:06 AM IST

X
Vamshi Kotas Updated On: 10 March 2025 11:06 AM IST
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంపై అర్ధరాత్రి గాంధీభవన్ వద్ద మైనారిటీ నేతల నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ ముస్లిం నేతలు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో 14% ముస్లిం జనాభా ఉన్నా ఎమ్మెల్యే కోటా కింద ఒక్క ముస్లిం అభ్యర్థికీ అవకాశం ఇవ్వలేదని మైనారిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని బేగంబజార్, ముషీరాబాద్ స్టేషన్లకు తరలించారు.ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల అద్దంకి దయాకర్ కేతావత్ శంకర్ నాయక్, విజయ శాంతి, మరో సీటు సీపీఐకి కేటాయించిన విషయం తెలిసిందే.
Next Story