మాగనూర్ ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం
నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. అధికారులు నిద్రపోతున్నారా ఏమి చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ వీక్‌లో మూడు సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. స్కూల్‌లో ఫుడ్ పాయిజనింగ్ చాలా సీరియస్ అంశమని సీజే జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. పిల్లలు చనిపోతే గానీ స్పందించరా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని.. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ ..ఘటనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలుపగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని హైకోర్టు గుర్తు చేసింది. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని న్యాయస్థానం న్యాయస్ధానం తెలిపింది.
మీడ్ డే మీల్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తరుచూ భోజనం వికటిస్తుందని ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నారాయణపేట జిల్లా మానగూరు జడ్పీ పాఠశాలలో నిన్న మళ్లీ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడగా.. వెంటనే వారిని మక్తల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో వారం వ్యవధిలోనే మరోసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఇంతకు ముందు 20న ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.