Telugu Global
Telangana

నా ఓటు ఎవరికంటే..? నిజం చెప్పిన ఫ్యామిలీ స్టార్

ఈ రోజు హాలిడే ఇచ్చింది ఇంట్లో కూర్చోడానికి కాదని చెప్పారు విజయ్ దేవరకొండ. తాను తన కుటుంబంతో కలసి ఓటు వేయడానికి బయటకొచ్చానని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని సూచించారు.

నా ఓటు ఎవరికంటే..? నిజం చెప్పిన ఫ్యామిలీ స్టార్
X

ఈ రోజు పోలింగ్ బూత్ కి వచ్చినవారెవరూ మీడియా ముందుకొచ్చి తాము ఫలానా పార్టీకి ఓటు వేశామని చెప్పలేదు. అభివృద్ధికి ఓటు వేశామని, సమర్థ నాయకుడికి వేశామని, భవిష్యత్తు బాగుపడేందుకుకి ఓటు వేశామని, మార్పుకి ఓటు వేశామని.. రకరకాల స్టేట్ మెంట్లు ఇచ్చారు. చిరంజీవి లాంటి హీరోలయితే కనీసం పోలింగ్ బూత్ ముందు మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. సైలెంట్ గా ఉండిపోయారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోననే అనుమానం అందరిలో ఉంది. అయితే హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఎవరికి ఓటు వేశాడో పరోక్షంగా చెప్పేశాడు. పోలింగ్ బూత్ బయట ఈ ఫ్యామిలీ స్టార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.


లేని నీళ్లొచ్చాయి, లేని కరెంటొచ్చింది..

ఓటు వేసి బయటకొచ్చిన తర్వాత మీడియాతో సావధానంగా మాట్లాడారు హీరో విజయ్ దేవరకొండ. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, అది అందరి బాధ్యత అని చెప్పారు. అయితే ఆయన అక్కడితో ఆగలేదు.. పరోక్షంగా తాను ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని కూడా చెప్పేశారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధిని ఓసారి చూడాలన్నారు. లేని నీళ్లొచ్చాయని, లేని ఎలక్ట్రిసిటీ వచ్చిందని, ముఖ్యంగా హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో అందరం చూస్తూనే ఉన్నామన్నారు. ఇంత బాగా చెప్పారంటే ఆయన ఎవరికి ఓటు వేశారో అర్థమైందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. విజయ్ దేవరకొండ వీడియోను వైరల్ చేస్తున్నారు.

హాలిడే ఇచ్చింది ఇంట్లో కూర్చోడానికి కాదు..

ఈ రోజు హాలిడే ఇచ్చింది ఇంట్లో కూర్చోడానికి కాదని చెప్పారు విజయ్ దేవరకొండ. తాను తన కుటుంబంతో కలసి ఓటు వేయడానికి బయటకొచ్చానని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లోనుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని సూచించారు. ఇతర హీరోలెవరూ ఇంత సుదీర్ఘంగా ఓటు గురించి చెప్పలేదు, హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడలేదు. హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నాయి.

First Published:  30 Nov 2023 4:34 PM IST
Next Story