Telugu Global
Telangana

ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీవర్షాలు.. ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం

ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీవర్షాలు.. ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం
X

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడిందని.. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి వైపు వాలి ఉండటంతో వచ్చే రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కదిలే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

దీంతో తెలంగాణలోని తూర్పు, ఉత్తర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక నిర్మల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఇక శనివారం ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో కొమురం భీం జిల్లాలోని వెంకట్రావు పేటలో 5 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్‌లో 6 సెంటీమీటర్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

*

First Published:  15 Sept 2023 1:30 AM GMT
Next Story