Telugu Global
Telangana

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కోంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. రేపు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది.

తెలంగాణలో అకాల వర్షం దంచికొట్టడంతో మార్కెట్ యార్డు, రోడ్లపై రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి వరద నీటి పాలైంది. ఆరుగాలం కష్టపడిన అన్నదాత పంట కళ్లముందే కొట్టుకుపోతుంటే రైతులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. ధాన్యం రాశుల్లో ఉన్న నీటిని తీసేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షంలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులుపడ్డారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా, తూకం వేయకపోవడంతో అన్నదాత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు

First Published:  31 Oct 2024 5:00 PM IST
Next Story