హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం కావడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట, బేగంపేట, కూకట్‌పల్లి, మూసాపేట్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, ప్రగతి నగర్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, బహదూర్ పల్లి, పేట్ బషీరాబాద్, కొంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, కృష్ణాపూర్, గౌడవెళ్లి, బోయినపల్లి,
మారేడ్‌పల్లి, చిలకలగూడ, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పంజాగుట్ట-అమీర్‌పేట రోడ్డు చెరువును తలపిస్తోంది. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి వర్షపు నీరు ఆగిన చోట సహాయక చర్యలు చేపట్టారు.