తెలంగాణకు 5 రోజులు భారీ వర్ష సూచన
నిన్న దుండిగల్‌లో 2.8 మి.మీ వర్షపాతం నమోదవ్వగా.. హకీంపేట్‌లో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే హైదరాబాద్‌లో 19.9 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.
తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశముంది. 15వ తేదీ రాష్ట్రంలోని సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశముందని, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.
నిన్న దుండిగల్‌లో 2.8 మి.మీ వర్షపాతం నమోదవ్వగా.. హకీంపేట్‌లో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే హైదరాబాద్‌లో 19.9 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 42.0 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. భద్రాచలంలో గరిష్టం 41.5, కనిష్టం 27.5, హకీంపేట్‌లో గరిష్టం 37.6, కనిష్టం 23.0గా నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. దుండిగల్‌లో గరిష్టం 38.6, కనిష్టం 23.6, హన్మకొండలో గరిష్టం 40.5, కనిష్టం 25.5, హైదరాబాద్‌లో గరిష్టం 38.9, కనిష్టం 20.3, ఖమ్మంలో గరిష్టం 40.4, కనిష్టం 25.4, మహబూబ్‌నగర్‌లో గరిష్టం 40.1, కనిష్టం 28.8, మెదక్‌లో గరిష్టం 40.0, కనిష్టం 23.8, నల్లగొండలో గరిష్టం 40.8, కనిష్టం 23.0, నిజామాబాద్‌లో గరిష్టం 41.4, కనిష్టం 27.4, రామగుండంలో గరిష్టం 41.2, కనిష్టం 25.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
ఈ రోజుతో సహా ఈనెల 16, 17, 18, 19 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.