Telugu Global
Telangana

రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన

మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పులలో అత్యధికంగా 11.5 సెం.మీ. వర్షం

రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు  భారీ వర్ష సూచన
X

మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడంచింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నది.

మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పులలో అత్యధికంగా 11.5 సెం.మీ. వర్షం పడింది. నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9, తిమ్మాపూర్‌లో 9.9, శౌలిగౌరారంలో 9.1, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.




జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం

సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. సింగూరు నుంచి నీరు వదలడంతో ఏడుపాయల ఆలయం గర్భగుడికి వరద వచ్చింది. ఆలయం రెండోరోజూ జలదిగ్బంధంలో ఉన్నది. ఏడుపాయల ఆలయం ఎదుట మంజీరా నది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్నది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో ఏడు పాయల ఆలయం ఈ నెలలో 12 రోజులు మూత పడింది.

భారీ వర్షాలకు జంట జలాశయాల్లో పెరుగుతున్న నీరు

భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. ఉస్మాన్‌ సాగర్‌ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కుల నీళ్లు మూసిలోకి విడుదల చేశారు. నేడు అధికారులు హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తనున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రజలు, లోతట్లు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

First Published:  25 Sept 2024 4:13 AM GMT
Next Story