కేటీఆర్ పరువునష్టం పిటిషన్‌పై నేడు విచారణ
మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు
BY Raju Asari14 Oct 2024 9:35 AM IST
X
Raju Asari Updated On: 14 Oct 2024 9:35 AM IST
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి ప్రత్యేక కోర్టు నేడు విచారించనున్నది. కేటీఆర్‌పై మంత్రి నిరాధారమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా మంత్రి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. కేటీఆర్ తరఫున న్యాయవాదులు 23 రకాల ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌లను పిటిషనర్ సాక్షులుగా చేర్చారు.
Next Story