Telugu Global
Telangana

కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ విచారణ 18కి వాయిదా

మంత్రి కొండా సురేఖ మీద కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ 18కి కోర్టు వాయిదా వేసింది.

కొండా సురేఖపై  కేటీఆర్ పిటిషన్ విచారణ 18కి వాయిదా
X

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ 18న కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులు బీఆర్‌నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లు రికార్డు చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఇక తదుపరి విచారణ 18కు వాయిదా వేసింది కోర్టు. కాగా టాలీవుడ్‌ హీరోయిన్లు, కేటీఆర్‌ మధ్య ఏదో ఉందని కొండా సురేఖ వ్యాఖ్యలు చేసి..క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

నటి సమంత, హీరో నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆరేనంటూ కొండా సురేఖ కొన్ని రోజుల క్రితం చేసిన కామెంట్స్ హాట్ టాఫీక్‌గా మారిన సంగతి తెలిసిందే దీనిపై ఈ నెల 10వ తేదీన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తనపై చేసిన వ్యాఖ్యలు దారుణమని, వెంటనే బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 356 కింద క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఇదిలా ఉంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున కూడా రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం విదితమే.

First Published:  14 Oct 2024 2:29 PM IST
Next Story