ఆరోగ్యం బాగైంది.. 10 రోజుల్లో వస్తా.. కేసీఆర్ ఫోన్‌కాల్ వైరల్
ఎరువుల షాపు యజమాని కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయగా.. ఇప్పుడు చాలా బాగైందని సమాధానం ఇచ్చారు. 10-15 రోజుల్లోనే వస్తానంటూ బదులిచ్చారు. ఈ ఫోన్ కాల్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలోనే ప్రజల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వంటిమామిడిలో ఉన్న ఆగ్రోస్ ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేసిన కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు పంపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎరువుల షాపు యజమాని కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయగా.. ఇప్పుడు చాలా బాగైందని సమాధానం ఇచ్చారు. 10-15 రోజుల్లోనే వస్తానంటూ బదులిచ్చారు. ఈ ఫోన్ కాల్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు పంపాలని వంటిమామిడి ఎరువుల వ్యాపారితో ఫోన్లో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. pic.twitter.com/fzavJbxtNw
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2024
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రగతిభవన్ నుంచి నేరుగా తన ఫామ్ హౌస్‌కు వెళ్లారు కేసీఆర్. 2023 డిసెంబర్ 8వ తేదీ రాత్రి కాలు జారి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అదే నెల 9న కేసీఆర్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే..హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. నేరుగా నందినగర్‌లోని తన సొంతింటికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు.
ఫిబ్రవరి 17న తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారని ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ రాక కోసం బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లోక్‌సభ స్థానాల సన్నాహక సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు.