'ఆయన ప్రధాన మంత్రి కాదు ప్రచార మంత్రి'
మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత , ద్రవ్యోల్భణం పెరిగిందని, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికంటాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.దేశంలో రైతుల పరిస్థితి గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత దయనీయంగా తయారైందని కేటీఆర్ అన్నారు.
ప్రధాని మోడీకి ఉన్నంత ప్రచార యావ మరెవరికీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ రోజూ ప్రెస్ మీట్ పెట్టని, విలేఖరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీడియాకు మొహం చూపించని మోడీ వారం వారం మన్ కీ బాత్ అంటూ మోనో లాగ్ వినిపిస్తాడు తప్ప జనం మాట వినడానికి ఆయనెప్పుడూ ఇష్టపడడని కేటీఆర్ విమర్శించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జరగని అభివృద్దిని గుజరాత్ లో ఏదో జరిగిపోతున్నట్టుగా విపరీతంగా ప్రచారం చేసి గుజరాత్ మోడల్ భారతదేశానికంతా అందించాలంటే తనను ప్రధానిని చేయాలని ప్రజలకు భ్రమ కల్పించిన పేపర్ టైగర్ మోడీ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత పెరిగిందని, ద్రవ్యోల్భణం పెరిగిందని, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికంటాయని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పాడు కానీ రైతుల పరిస్థితి గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత దయనీయంగా తయారైందని కేటీఆర్ చెప్పారు.
ఒక రైతుల పరిస్థితే కాదు అత్యధిక జనాభా పరిస్థితి దయనీయంగా తయారయిందని గత ఎనిమిదేళ్ళలో భారత దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయి ఇండియా ప్రపంచ పేదల క్యాపిటల్ గా తయారయ్యిందని కేటీఆర్ ఆరోపించారు.