Telugu Global
Telangana

వీడు మామూలోడు కాదు ఏకంగా చెరువులోనే బిల్డింగ్ కట్టేశాడు

సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా చేరువులోనే బహుళ అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు. చెరువు నీళ్లలో కట్టాడని మాములు ఇల్లు అనుకుంటున్నారేమో.. ఒకటీ రెండు కాదు నాలుగు అంతస్తుల భారీ భవనం నిర్మించాడు.

వీడు మామూలోడు కాదు ఏకంగా చెరువులోనే బిల్డింగ్ కట్టేశాడు
X

సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా చేరువులోనే బహుళ అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు. చెరువు నీళ్లలో కట్టాడని మాములు ఇల్లు అనుకుంటున్నారేమో.. ఒకటీ రెండు కాదు నాలుగు అంతస్తుల భారీ భవనం నిర్మించాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మధిర గ్రామం కుతుబ్‌శాయి పేట్ గ్రామంలో ఓ వ్యక్తి ఈ బిల్డింగ్ కట్టేడు. ప్రేండ్స్‌తో కలిసి వీకెండ్‌లో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారని స్థానికులు తెలిపారు. పన్నెండేళ్ల క్రితం నిర్మించిన ఈ బిల్డింగ్ ను తాజాగా హైడ్రా అధికారులు బాంబులు పెట్టి కూల్చేశారు. చెరువును ఆక్రమించి కట్టడంతో కూల్చివేశామని అధికారులు వివరించారు.

కూల్చివేతకు సంబంధించిన వీడియోను వైరల్‌వుతుంది. మరోవైపు బాంబులు పేలి శిథిలాలు ఎగిరి పడడంతో ఇద్దరు గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 12 ఏళ్ళ క్రితం ఈ భవనం ఇంత క్లియర్ గా చేరువులోనే జరుగుతున్నా స్థానిక అధికారులు ఏం చేశారు? ఎందుకు అడ్డుకోలేదు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెరువులోనే పిల్లర్లు వేసి కట్టి నిర్మాణానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? ఒకవేళ అనుమతి లేకుండా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేస్తే చర్యలు తీసుకోకుండా ఎందుకు ఇంత కాలం ఊరుకున్నారని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  26 Sept 2024 11:22 AM GMT
Next Story