ఒకటోతేదీ జీతాలేవి రేవంత్..? హరీష్ సూటి ప్రశ్న
కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల్లో పని చేస్తున్న కంప్యూటర్ టీచర్లకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. మూడు నెలలుగా వారికి జీతాలు లేవన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకటోతేదీనే జీతాలు ఇస్తామని అన్నారు ఆ పార్టీ నేతలు. అయితే కొన్నిచోట్ల అది సాధ్యం కావడంలేదు. కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నెలల తరబడి జీతాల బకాయిలు అలాగే ఉంటున్నాయి. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ ఆచరణ గడప దాటడం లేదని అన్నారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు హరీష్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నది. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
— Harish Rao Thanneeru (@BRSHarish) April 20, 2024
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పని చేస్తున్న ICT కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు అందడం…
కంప్యూటర్ టీచర్లకు ద్రోహం..
కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల్లో పని చేస్తున్న కంప్యూటర్ టీచర్లకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. మూడు నెలలుగా వారికి జీతాలు లేవన్నారు. వారి కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు, వీరి సంగతి ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు హరీష్ రావు.
మూడు నెలలుగా జీతాలు లేక గురుకులాల్లో పని చేస్తున్న ICT కంప్యూటర్ టీచర్లు అప్పులపాలయ్యారని, అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు హరీష్ రావు. వారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.