కాంగ్రెస్‌వి పచ్చి అబద్ధాలు.. నిరూపిస్తే రాజీనామా చేస్తా - హరీష్ రావు
మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు హరీష్ రావు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నీళ్లు, ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా తెలంగాణ నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. అయితే శ్వేతపత్రంలో మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని కాంగ్రెస్ చెప్పడాన్ని తప్పు పట్టారు మాజీ మంత్రి హరీష్ రావు.
మిడ్ మానేరు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టను - ఎమ్మెల్యే హరీష్ రావు pic.twitter.com/2QGH9Lr0QI
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2024
మిడ్‌మానేర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పూర్తి చేసిందన్నారు హరీష్ రావు. లెక్కలతో సహా వివరించారు. 2014లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టేనాటికి మిడ్‌మానేర్ ప్రాజెక్టులో 106 కోట్ల రూపాయల విలువైన పనులు మాత్రమే జరిగాయన్నారు. తర్వాత మూడేళ్లలో రూ.775 కోట్లు ఖర్చు పెట్టి మిడ్‌మానేర్‌ను పూర్తి చేశామన్నారు హరీష్ రావు.
మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు హరీష్ రావు. ఈ రెండు ప్రాజెక్టులు తామే పూర్తి చేశామని కాంగ్రెస్ మంత్రులు నిరూపిస్తే సభలో మళ్లీ అడుగుపెట్టనని ఛాలెంజ్ విసిరారు.