కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయుష్షు తక్కువే
సిద్ధిపేటలో యువతతో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని యువతకు సూచించారు.
రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా ఐదేళ్ల గరిష్ట కాలపరిమితితో ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయుష్షు మాత్రం ఐదేళ్లకంటే తక్కువేనని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొన్ని రాష్ట్రాల్లో సెల్ఫ్ గోల్స్‌తో ఐదేళ్లకంటే ముందే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని చెప్పారాయన. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కష్టమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విసుగొచ్చేసిందని, బీఆర్ఎస్ ని ఎందుకు దూరం చేసుకున్నామా అని ఆలోచిస్తున్నారని అన్నారు హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్నారు.
Live: సిద్దిపేట బీఆర్ఎస్ యూత్ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/53vCLWrrS1
— BRS Party (@BRSparty) April 8, 2024
తెలంగాణలో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలకు కొదవేలేదు. అయితే ప్రస్తుతానికి అంతా ఒకేతాటిపై ఉన్నట్టుగా కవర్ చేసుకుంటున్నారు. నివురుగప్పిన నిప్పు ఎప్పుడోఓసారి దహించక మానదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ ప్రమాదాన్ని ముందుగా అంచనావేసిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తరలిస్తున్నారని, వారందరితో ఆయన గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సిద్ధిపేటలో యువతతో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఢిల్లీలో తెలంగాణ గొంతు వినిపించడానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని యువతకు సూచించారు. తెలంగాణ వద్దు అంటూ తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి, ఈ రోజు సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని ఏనాడైనా అన్నారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నోటిఫికేషన్లు ఇస్తే, కాంగ్రెస్ ఉద్యోగాలు ఇచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు హరీష్.