ఆటో డ్రైవర్లకు పరిహారం ఇవ్వాల్సిందే..
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత రవాణా పథకంతో ఆటో డ్రైవర్ల పొట్టకొట్టినందుకు పరిహారంగా.. వారికి నెలకు రూ.15వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మంచి కార్యక్రమమే కానీ.. అదే సమయంలో ఆటో కార్మికుల కష్టాలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు హరీష్ రావు. ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో మరొకరి కడుపు కొట్టకూడదన్నారాయన. ప్రభుత్వం ఓ వర్గానికి మంచి చేయాలని, మరో వర్గం ఉసురుపోసుకుందని విమర్శించారు హరీష్. ప్రస్తుతం తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని, రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరపున పోరాటం చేస్తామని చెప్పారు హరీష్ రావు.
సిద్దపేట్ పట్టణంలో ‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఆధ్వరంలో ఆటల పొటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు గారు.
— Office of Harish Rao (@HarishRaoOffice) January 13, 2024
హరీష్ రావు గారి కామెంట్స్
సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శం.… pic.twitter.com/1AvNl0GTYX
అసెంబ్లీలో పోరాటం..
ఆటో డ్రైవర్లకోసం అవసరమైతే అసెంబ్లీలో సైతం పోరాటం చేస్తామన్నారు హరీష్ రావు. వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. ఆటో కార్మికులు సొసైటీ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రానికే ఆదర్శమన్నారు. 1480 మంది ఆటో డ్రైవర్లు సొసైటీలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. సిద్దిపేటకు ఆటో డ్రైవర్లు బ్రాండ్ అంబాసిడర్లు అని కొనియాడారు. పట్టణానికి వచ్చే అతిథులను గౌరవమర్యాదలతో గమ్య స్థానాలకు చేరవేర్చేది వారేనన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం ఇప్పుడు రోడ్డునపడేసిందని విమర్శించారు హరీష్ రావు.
నెలకు రూ.15వేలు..
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత రవాణా పథకంతో ఆటో డ్రైవర్ల పొట్టకొట్టినందుకు పరిహారంగా.. వారికి నెలకు రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. అది వారికి జీవన భృతిగా ఉపయోగపడుతుందన్నారు. రోడ్డున పడేసిన ప్రభుత్వమే వారిని ఆదుకోవాలన్నారు. ఆటో డ్రైవర్ల భృతికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. వారి తరపున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు.