నూకలు చెల్లింది మీకే.. అమిత్ షా కు హరీష్ రావు కౌంటర్
2జీ 3జీ 4జీ కాదు.. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు హరీష్ రావు. రాబోయే ఎన్నికల్లో ఈ నాజీలు మాజీలేనని అన్నారు.
ఖమ్మంలో కేంద్ర మంత్రి అమిత్ షా సభతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేసీఆర్ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలకు వెంటనే కౌంటర్లు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సీఎం సీటు కాదు కదా, కనీసం సింగిల్ డిజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. అమిత్ షా వి అబద్ధపు విమర్శలు, ఔట్ డేటెడ్ స్క్రిప్ట్ అంటూ సెటైర్లు పేల్చారు.
అమిత్ షా ఏమన్నారంటే..?
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని ఖమ్మం సభలో అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్ పనిచేస్తుంటే, కల్వకుంట్ల కుటుంబం కోసం బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని అన్నారు. త్వరలోనే బీజేపీ ముఖ్యమంత్రి భద్రాచలం వెళ్లి రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు అమిత్ షా.
తెలంగాణలో కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ మొదలైంది. అరాచక పాలన దూరం చేయాలని ప్రజలు సుముఖంగా ఉన్నారు.
— BJP Telangana (@BJP4Telangana) August 27, 2023
అధికార మదంతో ప్రతిపక్షాలపట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్ పాలనకు అంతిమ గడియలు.- ఖమ్మం సభలో కేంద్ర మంత్రి @AmitShah గారు.
#RaithuGosaBJPBharosa #AmitShah pic.twitter.com/BQ1x3N4cLe
నూకలు చెల్లింది మీకే..
అమిత్ షా వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్లు మొదలయ్యాయి. కాస్త ఘాటుగా కేంద్ర మంత్రికి బదులిచ్చారు రాష్ట్ర మంత్రి హరీష్ రావు. ‘‘నూకలు మాకు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి ఇక్కడ నూకలు చెల్లిపోయాయి. బ్యాట్ సరిగా పట్టుకోవడం చేతకాని మీ అబ్బాయికి బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.’’ అని ట్వీట్ చేశారు హరీష్ రావు.
మాకు నూకలు చెల్లడం కాదు..
— Harish Rao Thanneeru (@BRSHarish) August 27, 2023
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి
బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం…
2జీ 3జీ 4జీ కాదు.. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు హరీష్ రావు. రాబోయే ఎన్నికల్లో ఈ నాజీలు మాజీలేనని అన్నారు. పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్లకు కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన బీజేపీ నేతలు, రైతు బాంధవుడైన కేసీఆర్ ను విమర్శిస్తారా అని ప్రశ్నించారు హరీష్ రావు.