జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌ను ఖండించిన హరీశ్‌రావు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించగానే.. హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా చివరిసారిగా మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు సర్.. మీరు ప్రధాన ప్రతిపక్షానికి మీరు మైక్ ఇవ్వరా సర్ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
అసెంబ్లీలో మాట్లాడేందుకు మాకు ఎందుకు అవకాశం ఇవ్వరని హరీశ్‌రావు సభాపతిని ప్రశ్నించారు.స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వచ్చారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన జగదీశ్ రెడ్డి కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చున్నారు. అక్కడ్నుంచి కూడా వెళ్లిపోవాలని చీఫ్ మార్షల్ జగదీశ్ రెడ్డికి సూచించారు. సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ సభ్యులు చీఫ్ మార్షల్‌కు సూచించారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.