కేసీఆర్, తెలంగాణ ఒకటే.. ఎవరూ వేరు చేయలేరు
ఓడినంత మాత్రన తాము ప్రజలను వదిలేయబోమన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లని, వారి పక్షాన పోరాడతామని పేర్కొన్నారు.
కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని, కేసీఆర్ ను తెలంగాణ ను ఎవరూ వేరు చేయలేరన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించింది కేసీఆరేనని చెప్పారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.
గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి @BRSHarish గారు.
— Office of Harish Rao (@HarishRaoOffice) January 12, 2024
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ZP చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ గారు, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, స్థానిక నాయకులు,… pic.twitter.com/pKSEiCH8Uo
ఓడినంత మాత్రన తాము ప్రజలను వదిలేయబోమన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లని, వారి పక్షాన పోరాడతామని పేర్కొన్నారు. బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. కొత్త విద్యుత్ పాలసీ అంటే ఏంటని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నట్టుగా కరెంటు సరఫరా చేస్తారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు హరీష్ రావు.
ఆ బాధ్యత మాదే..
తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు హరీష్ రావు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చాయని, గ్రామలు అభివృద్ధి చెందాయని, తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చిందని, రైతుబంధు, రైతు బీమా వచ్చాయని వివరించారు. కేసీఆర్ కిట్ వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు బీఆర్ఎస్ సమర్థ పాలనను పదే పదే గుర్తు చేస్తాయన్నారు హరీష్ రావు.