Telugu Global
Telangana

కాంగ్రెస్ కి ఓటు వేస్తే.. పామునోట్లో తలపెట్టినట్టే

కాంగ్రెస్ నేతల మాటల్ని ఎవరూ నమ్మొద్దన్నారు, రాష్ట్రాన్ని ఆగం కానీయొద్దని సిద్ధిపేట సభలో హితవు పలికారు. కేసీఆర్‌ మాట తప్పడని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని చెప్పారు హరీష్ రావు.

కాంగ్రెస్ కి ఓటు వేస్తే.. పామునోట్లో తలపెట్టినట్టే
X

పొరపాటున రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే, కైలాసం ఆటలో పెద్దపాముకి చిక్కినట్టేనని అన్నారు మంత్రి హరీష్ రావు. కొందరి నాలుకకు నరం లేనట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మాటల్ని ఎవరూ నమ్మొద్దన్నారు, రాష్ట్రాన్ని ఆగం కానీయొద్దని సిద్ధిపేట సభలో హితవు పలికారు. కేసీఆర్‌ మాట తప్పడని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని చెప్పారు హరీష్ రావు.

తెలంగాణలో వైద్య వ్యవస్థను బలోపేతం చేశామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిందని తెలిపారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో భూమికి బరువు అయ్యేంత పంట పండుతోందన్నారు. గతంలో ఎరువుల బస్తా కోసం చెప్పులను క్యూలైన్‌ లో పెట్టేవారని, ఇప్పుడు ప్రభుత్వం తగినంత యూరియాను అందుబాటులో ఉంచుతుందన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు కూలీకి వెళ్లేవారని, ఇప్పడు పక్క రాష్ట్రాల వారికి కూలీ ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. బీజేపీ గ్యాస్‌ ధరను అడ్డగోలుగా పెంచిందని, దాన్ని తగ్గించాడనికి సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని చెప్పారు హరీష్ రావు.

అనాథలుగా ఉన్న పిల్లలకోసం శిశు గృహను ఏర్పాటు చేశామన్నారు హరీష్ రావు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ని ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులకోసం ప్రభుత్వ నిర్వహణలోనే ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, సామాజిక పెన్షన్ వల్ల వృద్ధులకు కొంత ఉపశమనం కలుగుతోందన్నారు. సమాఖ్య భవనాలతో మహిళలకు భరోసా లభిస్తోందని చెప్పారు. నూతన జిల్లాలలోనే మొదటి జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలోనే ఉందన్నారు హరీష్ రావు.

First Published:  9 Oct 2023 7:06 PM IST
Next Story