తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు : కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశనీ ! అర్జునస్య ధనుర్దారీ.. రామస్య ప్రియ దర్శినీ ! జమ్మి పూజతో నిత్య జయాలు కలగాలి ! పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు జరగాలి ! అలయ్ బలయ్ ఆత్మీయ ఆలింగనాలు, సరదాలు, సంతోషాలతో అందరూ దసరాపండుగ జరుపుకోవాలని కోరుకుంటూ… అందరికీ విజయదశమి శుభాకాంక్షలు’ అని కేటీఆర్ ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.అదేవిధంగా ఇంగ్లిష్‌లో కూడా ‘హ్యాపీ దసరా టూ ఆల్ అని కేటీఆర్ రాసుకొచ్చారు. కాగా ఇవాళ దేశవ్యాప్తంగా దసరా పండుగ జరుపుకుంటున్నారు. శ్రీరాముడు రావణాసురుడిని వధించిన రోజున దసరా ఉత్సవం జరుపుకోవడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నది..
ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ‘దసరా’ను పురస్కరించుకొని దుర్గాదేవిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానమున్నదన్నారు. అలాయ్ బలాయ్ తీసుకుని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం ద్వారా దసరా పండుగ సందర్భంగా ప్రజల మధ్య సామాజిక సామరస్యం పరిఢ విల్లుతుందన్నారు. ప్రజలు తాము నిర్వర్తించే వృత్తులకు సంబంధించిన ఉత్పత్తి పరికరాలను, వినియోగించే వాహనాలను ఆయుధ పూజ చేసి గౌరవించుకునే గొప్ప సంప్రదాయం దసరా ప్రత్యేకత అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పక్షిగా పాలపిట్టను,రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు ను గుర్తించడంతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు.