ఆత్మగౌరవంతో జీవించాలని చాటి చెప్పిన వ్యక్తి గురునానక్ : సీఎం
వినయం, సేవాభావంతో జీవితాన్ని గడపాలని చెప్పిన గురునానక్ సందేశం సదా అనుసరణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
BY Vamshi Kotas14 Nov 2024 4:15 PM GMT
X
Vamshi Kotas Updated On: 14 Nov 2024 4:15 PM GMT
సిక్కు మత స్థాపకులు గురునానక్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, సిక్కు సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వినయం, సేవాభావంతో జీవితాన్ని గడపాలని చెప్పిన గురునానక్ సందేశం సదా అనుసరణీయమని ముఖ్యమంత్రి అన్నారు. గురునానక్ ప్రవచించిన ప్రేమ, కరుణ, మానవతా సందేశాలు అందరినీ సరైన మార్గంలో నడిపిస్తాయని ఆయన ఆకాంక్షించారు. శ్రమ గౌరవాన్ని, సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోవాలని గురునానక్ బోధించారని సీఎం గుర్తు చేశారు. ప్రజలు సోదరభావం, సామరస్యం, ఆత్మగౌరవంతో జీవించాలనే చింతనను ప్రపంచానికి చాటి చెప్పారని సీఎం కొనియాడారు. గురునానక్ జీవితం, ఆయన బోధనలు మానవాళికి నిరంతరం ప్రేరణ కలిగిస్తాయని సీఎం పేర్కొన్నారు.
Next Story