Home > NEWS > Telangana > కౌటాల పోలీస్‌స్టేషన్‌లో గన్ మిస్ ఫైర్..! - కానిస్టేబుల్ గొంతులోకి దూసుకెళ్లిన బుల్లెట్
కౌటాల పోలీస్‌స్టేషన్‌లో గన్ మిస్ ఫైర్..! - కానిస్టేబుల్ గొంతులోకి దూసుకెళ్లిన బుల్లెట్
కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడా.. లేక గన్ మిస్ ఫైర్ అయిందా అన్న విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు.
BY Telugu Global8 Nov 2022 3:16 AM

X
Telugu Global Updated On: 8 Nov 2022 3:16 AM
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఉదయం గన్ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ కానిస్టేబుల్ గొంతులో నుంచి తలలోకి దూసుకెళ్లింది. దీంతో కానిస్టేబుల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటన ఎలా జరిగింది.. కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడా.. లేక గన్ మిస్ ఫైర్ అయిందా అన్న విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్ కాగజ్‌నగర్‌లోని కానిస్టేబుల్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకొని అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మెరుగైన చికిత్స కోసం కానిస్టేబుల్‌ని అధికారులు హైదరాబాద్‌కు తరలించారు.
Next Story