Telugu Global
Telangana

మిషన్ భగీరథను చూసి గుజరాత్ అధికారులు ఎగతాళి చేశారు...మూడున్నరేళ్లలోనే పూర్తి చేసి ప్రధానితోనే ప్రారంభోత్సవం చేయించాం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ ఎప్పుడూ తలెత్తుకుని నిలబడాలనేదే సీఎం కేసిఆర్ గారి లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు

మిషన్ భగీరథను చూసి గుజరాత్ అధికారులు ఎగతాళి చేశారు...మూడున్నరేళ్లలోనే పూర్తి చేసి ప్రధానితోనే ప్రారంభోత్సవం చేయించాం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

తెలంగాణ ఎప్పుడూ తలెత్తుకుని నిలబడాలనేదే సీఎం కేసిఆర్ గారి లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నేడు తాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలపై పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన "మంచినీళ్ల పండుగ" తాగునీటి విజయాలు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , ఎర్రబెల్లి ప్రశాంత్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలీ, శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి,..హాజరైన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,హోమ్ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జలవనరుల అభివృద్ది సంస్థ చైర్మన్ వి.ప్రకాష్..అధికారులు స్మితా సబర్వాల్,జలమండలి ఎండీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాగునీటి రంగంలో సాధించిన విజయాలపై రూపొందించిన బుక్ లెట్ లు మంత్రులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.... సమైక్య పాలనలో తాగునీటి కోసం ఎంతో గోస పడ్డామని గుర్తు చేశారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఖాళీ బిందెలతో వీదుల్లో నిరసనలు,వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు ఉండేవని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ 1986 లోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా 100 కోట్లతో సిద్దిపేట లోని 108 గ్రామాలకు ఇంటింటికీ నల్లాతో మంచి నీళ్ళు అందించారని....అదే మొండి దైర్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ మంచి నీళ్ళు ఎందుకు ఇవ్వలేం అని మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. కేటీఆర్ గారు పంచాయతీ రాజ్ మంత్రిగా ఉండి పథకం రూపకల్పన చేసినప్పుడు.. సీఎం కేసీఆర్ తమ టీమ్ ను గుజరాత్ లో డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఉంటే పరిశీలనకు పంపారని....గుజరాత్ అధికారులు మీరు నాలుగు ఏళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేస్తారా..?మోడీ తోనే కాలేదు మీరు ఎలా చేస్తారని ఎగతాళిగా నవ్వరన్నారు. ఆ విషయం కేసిఆర్ తో చెప్తే కేసీఆర్ మూడున్నర సంవత్సరాల్లో చేద్దాం అని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు.

ప్రధాని మోడీనే ప్రారంభానికి ముఖ్య అతిథిగా పిలుద్దాం అన్నారన్నారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. తనకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించి ఆయన దగ్గరుండి పనులు మానిటరింగ్ చేయడమే గాక ఎన్నో సమీక్షలు నిర్వహించారని...దాని ఫలితంగానే నేడు తెలంగాణ లో ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీళ్ళు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి నల్లా త్రాగు నీరు అందించకుంటే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న,కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నాడు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన సీఎం కేసిఆర్ గారికి మంత్రి ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

First Published:  18 Jun 2023 9:49 PM IST
Next Story