గృహలక్ష్మి, మహాలక్ష్మి ఒక్కరే.. చూస్కోవాలి కదా..!
రాష్ట్రాల్లో చేసే ప్రచార కార్యక్రమాల్లో కూడా లబ్ధిదారుల ఫొటోలను కామన్ గా వాడటమేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ప్రచారానికి తెలంగాణలో మహిళల ఫొటోలు దొరకలేదా అని అంటున్నారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి ఒకరే అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు.
కర్నాటకలో ఇటీవల గృహలక్ష్మి అనే పథకాన్ని అమలులోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్టుగా ప్రతి గృహిణికి 2వేల రూపాయల ఆర్థిక సాయం మొదలు పెట్టింది. ఆ సందర్భంగా అక్కడ గృహలక్ష్మి పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ఆ ప్రచారంలో ఓ మహిళను సామాన్య గృహిణిగా, గృహలక్ష్మిగా చూపించారు. కట్ చేస్తే ఇప్పుడు ఆమెనే తెలంగాణలో మహాలక్ష్మిగా తెరపైకి తెచ్చారు. ఈ రెండు పోస్టర్లపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
కాంగ్రెస్ జాతీయ పార్టీయే, కాదనడంలేదు. జాతీయ నేతల ఫొటోలతోనే రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసుకుంటారు. కానీ రాష్ట్రాల్లో చేసే ప్రచార కార్యక్రమాల్లో కూడా లబ్ధిదారుల ఫొటోలను కామన్ గా వాడటమేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ప్రచారానికి తెలంగాణలో మహిళల ఫొటోలు దొరకలేదా అని అంటున్నారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి ఒకరే అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు.
సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..?
కర్నాటకలో కాంగ్రెస్ కి మహిళా సెంటిమెంట్ వర్కవుట్ అయింది. గృహలక్ష్మి పథకంలో ఆర్థిక సాయంతోపాటు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా ఉంది. ఆ విజయం చూసే చంద్రబాబు వాటిని ఏపీలో కాపీకొట్టారు, మినీ మేనిఫెస్టో ఇచ్చారు. కాంగ్రెస్ కూడా తెలంగాణ ఎన్నికల్లో ఇవే ఐడియాలు వాడుకోవాలని చూస్తోంది. అందుకే కర్నాటక పథకాలనే తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో తెరపైకి తెచ్చింది. పథకాలే కాదు, ప్రచారానికి ఉపయోగించుకున్న ఫొటోలను కూడా మార్చకపోవడం ఇక్కడ విశేషం.