Telugu Global
Telangana

గ్రూప్‌ -3 పరీక్షకు గంట ముందే రావాలే

పరీక్ష ప్రారంభమయ్యాక సెంటర్‌ లోకి అనుమతి లేదు

గ్రూప్‌ -3 పరీక్షకు గంట ముందే రావాలే
X

గ్రూప్‌ -3 పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్‌ సెంటర్‌ కు చేరుకోవాలని టీజీపీఎస్సీ, రాష్ట్ర అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఆదివారం రెండు పరీక్షలు, సోమవారం ఒక పరీక్ష ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ లో ట్రిఫిక్‌ ఇబ్బందులు, ఇతర సమస్య నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు వీలైనంత ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఉదయం 9.30 గంటలకు పేపర్‌ -1 పరీక్ష ప్రారంభమవుతందని, ఈ ఎగ్జామ్‌ కోసం 8.30కే సెంటర్‌ కు చేరుకోవాలన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రెండో పేపర్‌ ఉంటుందని, 1.30కే పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు. ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్‌ సెంటర్‌ లోకి అనుమతించబోమని తెలిపారు. అభ్యర్థులు వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్‌ కాపీతోనే పరీక్షకు హాజరుకావాలన్నారు. ఫస్ట్‌ పేపర్‌ కు ఏ హాల్‌ టికెట్‌ కాపీతో హాజరవుతారో మిగతా రెండు పరీక్షలకు అదే హాల్‌ టికెట్‌ తీసుకొని రావాలన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియ ముగిసే వరకు హాల్‌ టికెట్లు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

First Published:  16 Nov 2024 8:30 PM IST
Next Story