Telugu Global
Telangana

తెలంగాణలో మళ్లీ గ్రూప్‌-2 వాయిదా.. నెక్ట్స్ ఎప్పుడంటే..?

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నవంబర్‌లో జరగాల్సిన పరీక్ష మళ్లీ జనవరి 6, 7 తేదీన నిర్వహిస్తామని TSPSC ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి.

తెలంగాణలో మళ్లీ గ్రూప్‌-2 వాయిదా.. నెక్ట్స్ ఎప్పుడంటే..?
X

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. పరీక్ష కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని TSPSC స్పష్టం చేసింది. మొత్తం 783 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా.. దాదాపు ఐదున్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌ - 2 పరీక్ష నిర్వహించడానికి TSPSC మొదట్లో ఏర్పాట్లు చేయగా.. అదే సమయంలో మరికొన్ని పోటీ పరీక్షలు ఉండటంతో వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశారు.

అయితే తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నవంబర్‌లో జరగాల్సిన పరీక్ష మళ్లీ జనవరి 6, 7 తేదీన నిర్వహిస్తామని TSPSC ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి. ఇక TSPSC ఛైర్మన్, సభ్యులు రాజీనామాలు చేయడంతో పరీక్ష మరోసారి వాయిదా పడింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించగానే కొత్త కమిషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులు నియమించిన తర్వాత గ్రూప్‌-2 పరీక్ష తేదీపై స్పష్టత రానుంది.


బుధవారం నాటి ప్రెస్‌మీట్‌లోనూ రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పారు. 2024 డిసెంబర్‌ నాటికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఎవరు గందరగోళం పడాల్సిన అవసరం లేదన్నారు.

First Published:  28 Dec 2023 8:45 AM IST
Next Story