Telugu Global
Telangana

గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు నిర్వహించనున్నరు. గ్రూప్‌-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లపై హైకోర్టు కీలక తీర్పు
X

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు నిర్వహించనున్నరు. గ్రూప్‌-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 21 నుంచి గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప‌రీక్ష‌ల‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌న్నింటినీ హైకోర్టు కొట్టి వేసింది.ఇక అశోక్ న‌గ‌ర్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

గ్రూప్-1 ప‌రీక్ష‌ల‌ను వాయిదా చేయాల‌ని ఆందోళ‌న‌కు దిగిన అభ్య‌ర్థుల‌పై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పోలీసుల దాడుల్లో ప‌లువురు అభ్య‌ర్థులకు తీవ్ర గాయాల‌య్యాయి. జీవో 29 ర‌ద్దు చేసేంత వ‌ర‌కు తమ పోరాటం ఆగ‌ద‌ని అభ్య‌ర్థులు తేల్చిచెప్పారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాల‌తో అశోక్ న‌గ‌ర్ ద‌ద్ద‌రిల్లిపోతోంది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్‌ జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

First Published:  18 Oct 2024 5:46 PM IST
Next Story