Telugu Global
Telangana

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్‌

రూ. 826 కోట్లతో జంక్షన్ల అభివృద్ది చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్‌
X

నగరంలో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ. 826 కోట్లతో జంక్షన్ల అభివృద్ది చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఆరు జంక్షన్ల అభివృద్ధి నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. హెచ్‌ సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనున్నది. రెండు ప్యాకేజీలుగా ఆరు జంక్షన్లను అభివృద్ధి చేస్తారు. మొదటి ప్యాకేజీలో రూ. 421 కోట్లతో జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ జంక్షన్‌, కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ జంక్షన్‌, రెండో ప్యాకేజీలో రూ. 405 కోట్లతో రోడ్‌ నెం. 45 , ఫిల్మ్‌ నగర్‌ , మహారాజా అగ్రసేన్‌ , క్యాన్సర్‌ అస్పత్రి జంక్షన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు.

First Published:  28 Sept 2024 1:44 PM GMT
Next Story