నిధుల సేకరణపై జీహెచ్‌ఎంసీ ఫోకస్
ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా నేడు వెలవెలబోతోంది. ఫిక్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మరో వైపు పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. మరోవైపు రోజుకో కొత్త ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీపై భారం పెరుగుతోంది.
బల్దియాను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఉద్యోగుల వేతనాల చెల్లింపులో జాప్యంతో పాటు, వందల కోట్ల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటికే దాదాపు 6వేల కోట్లు అప్పులు చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, వాటికి ప్రతి రోజు కోటి ముప్పై లక్షల వడ్డీ చెల్లిస్తోంది.
మరోవైపు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ రెండో దశకు రూ. 4,300 కోట్లు, నాలా అభివృద్ది పనులకు రూ.1,000 కోట్ల పనులకు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరింది జీహెచ్‌ఎంసీ. నడుస్తున్న పనులకు, కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం బల్దియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మున్సిపల్ బాండ్లను విక్రయించడం ద్వారా నిధుల సేకరణ చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా నేడు వెలవెలబోతోంది. ఫిక్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మరో వైపు పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. మరోవైపు రోజుకో కొత్త ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీపై భారం పెరుగుతోంది. దీంతో ఓ వైపు జీతాలు, మరో వైపు మెయింటెనెన్స్ కష్టంగా మారుతోంది. ఒకటో తేదీ వచ్చిందంటే ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లు ఆపాలి, ఏ బిల్లు విడుదల చెయ్యాలి అంటూ కుస్తీ పడుతున్నారు. మెయింటెనెన్స్ బిల్లులు 800 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన నాలుగైదేళ్లలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (SRDP), కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం (CRMP), ఇందిరమ్మ ఇళ్ల కోసం జీహెచ్‌ఎంసీ దాదాపు 6వేల కోట్ల అప్పుచేసింది.
హైదరాబాద్‌లో మరిన్ని జంక్షన్ల అభివృద్దికి రెండవ దశ ఎస్‌ఆర్‌డీపీ 15 ప్రాజెక్ట్ పనుల కోసం రూ.4,300 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది జీహెచ్‌ఎంసీ. నాలా పనుల రెండవ దశ కోసం రూ.1,000 కోట్లు అవసరం అవుతాయని, వాటికి అనుమతులు ఇవ్వడంతోపాటు నిధులు సమకూర్చాలని ప్రభుత్వానికి బల్దియా విజ్ఞప్తి చేసింది. ఆర్థిక ఇక్కట్ల నుంచి బయటపడేందుకు మున్సిపల్ బాండ్లు విక్రయించడం ద్వారా రూ.1000 కోట్లు సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.