Telugu Global
Telangana

బుద్ధ వనంలో ఘనంగా దమ్మ దీపోత్సవం

వేల దీపకాంతులతో వందల సంఖ్యలో బౌద్ధ బౌద్ధ అభిమానులతో దీపా యాత్ర బుద్ధవనం మహాస్తుపంలోని బుద్ధ భగవానుని వరకు కొనసాగింది.

బుద్ధ వనంలో ఘనంగా దమ్మ దీపోత్సవం
X

నాగార్జునసాగర్‌లోని బుద్ధ వనంలో రెండవ దమ్మ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుద్దవనంలోని ఎంట్రన్స్ ప్లాజా వద్ద డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మనవడు, మాజీ పార్లమెంటు సభ్యులు, బహుజన మహాసంగ్ పార్టీ అధ్యక్షులు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్యఅతిథిగా మొదటి దీపం వెలిగించగా.. వేల దీపకాంతులతో వందల సంఖ్యలో బౌద్ధ బౌద్ధ అభిమానులతో దీపా యాత్ర బుద్ధవనం మహాస్తుపంలోని బుద్ధ భగవానుని వరకు కొనసాగింది. అంతముందు బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి, అనంతరం ఇటీవల మహస్తుపంలో ప్రతిష్టించిన బుద్ధ దాతువుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ.. మంచి చెడులను విశ్లేషించి మంచిని మాత్రమే స్వీకరించే నైతికతను జీవన విధానంగా బోధించిన బుద్ధుని మార్గం అనుస‌ర‌ణీయ‌మ‌ని, రాబోవు రోజులలో బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రం అవుతుందన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య బౌద్ధ దీపోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. దమ్మ దీపోత్సవం నేపథ్యాన్ని వివరించి ఇక ముందు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం దమ్మ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

బుద్ధ విషయ నిపుణులు, బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బుద్ధవనం విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధ వనం ఓఎస్‌డి సుధాన్ రెడ్డి, ఒమన్, కెకె రాజా, ఎన్‌ఎల్‌ఎన్ మూర్తి, డి.ఆర్. శ్యాంసుందర్రావు, ఏఈ నజీష్ , ప్రకాష్ అంబేద్కర్ కుటుంబ సభ్యులతోపాటు బౌద్ధ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

First Published:  13 Nov 2023 6:48 PM IST
Next Story