ట్యాంక్ బండ్ పై ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మలతో మంత్రి సీతక్క భారీ ర్యాలీ నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ మీద బతుకమ్మలతో మంత్రి సీతక్క భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ అంతా మారు మ్రోగుతోంది. ఓవైపు కళాకారులు, మరోవైపు మహిళలు ట్యాంక్ బండ్ కన్నుల పండుగగా కనిపిస్తోంది. బతుకమ్మలతో పండువ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఈసారి డీజీలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం సొంతంగా పాటలు పాడేలా ఏర్పాట్లు చేసింది. ఇలా ఏర్పాటు చేయడంతో మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేశారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో గౌరమ్మని పేర్చి ఆడి పాడుతున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల్లో అంటూ సందడి చేస్తున్నారు. ఉరేగింపుగా వెళ్లూ బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు.