Telugu Global
Telangana

తెలంగాణలో నేటినుంచి గ్రామ సభలు..

2023-24 సంవత్సరంలో అందుబాటులో ఉన్న నిధులతో చేపట్టే పనుల గురించి ఈ గ్రామ సభల్లో చర్చిస్తారు. అదే సమయంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామ అవసరాలకు ప్రాధాన్య క్రమంలో పనులను నిర్ణయిస్తారు.

తెలంగాణలో నేటినుంచి గ్రామ సభలు..
X

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత తమ మార్కు చూపించాలని ఉవ్విళ్లూరుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ముందుగా గ్రామ సభలు నిర్వహించి ప్రజా పాలన దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు గ్రామసభలతో స్థానిక సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. ఈ గ్రామ సభలు ఈరోజు నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 27 వరకు ఈ సభలు జరుగుతాయి.

ఏమేం చర్చిస్తారు..?

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ పంచాయతీల అవసరాలపై ప్రణాళికలు రూపొందించడానికి పీపుల్స్‌ ప్లాన్‌ క్యాంపెయిన్‌ (పీపీసీ)లో భాగంగా ఈ సభలు జరుగుతాయంటున్నారు అధికారులు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ హన్మంతరావు జిల్లాల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ లను ఈ గ్రామ సభల్లో ఆమోదిస్తారు.

2023-24 సంవత్సరంలో అందుబాటులో ఉన్న నిధులతో చేపట్టే పనుల గురించి ఈ గ్రామ సభల్లో చర్చిస్తారు. అదే సమయంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామ అవసరాలకు ప్రాధాన్య క్రమంలో పనులను నిర్ణయిస్తారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సబ్‌ కీ యోజన- సబ్‌ కా వికాస్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది.

First Published:  17 Jan 2024 9:19 AM IST
Next Story