గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ.. రెండో రౌండ్‌లోనూ బీజేపీదే ఆదిక్యం
1,493 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి
BY Naveen Kamera4 March 2025 4:29 PM IST

X
Naveen Kamera Updated On: 4 March 2025 5:19 PM IST
కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో రెండో రౌండ్‌లో బీజేపీ స్పష్టమైన ఆదిక్యం కనబరిచింది. మొదటి రౌండ్‌లో స్వల్ప ఆదిక్యం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 1,493 ఓట్ల ఆదిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 14,691 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10,794 ఓట్లు వచ్చాయి. యాదగిరి శేఖర్ రావుకు 802, ముస్తాక్ అలీకి 365, రవీందర్ సింగ్ కు 223 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో రౌండ్ కు 21 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లను 11 రౌండ్లలో లెక్కించనున్నారు.
Next Story