Telugu Global
Telangana

అందరికీ విద్య, వైద్యం, ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే

గురుకులాల విద్యార్థులతో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి

అందరికీ విద్య, వైద్యం, ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే
X

రాష్ట్రంలోని ప్రజలందరికీ విద్య, వైద్యం అందించడం.. ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం సెక్రటేరియట్‌ లో గురుకులాల విద్యార్థులతో ఆయన భేటీ అయ్యారు. దేశ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలన్నారు. మెరుగైన విద్య అందించేందుకే డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలు పెంచామని, 11 వేల టీచర్లు నియమించామన్నారు. సామాజిక న్యాయం కోసం కుల గణన చేస్తున్నామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. చదువుతో పాటు స్కిల్స్‌ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని.. అందుకే నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టాటా ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో ఐఐటీలను ఏటీసీలుగా మారుస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఒలింపిక్స్‌ లో మెడల్స్‌ సాధించడమే లక్ష్యంగా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్‌ రాష్ట్రానికి గుండెకాయలాంటిదని.. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రానున్న రోజుల్లో సెక్రటేరియట్‌ లో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయన్నారు. ఈనెల 14న 15 వేల మంది విద్యార్థులతో మంచి కార్యక్రమం చేయబోతున్నామని తెలిపారు. అదే రోజు రెండో ఫేజ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ మంజూరు చేస్తామన్నారు.

First Published:  6 Nov 2024 1:57 PM GMT
Next Story