Telugu Global
Telangana

'మూసీ' బాధితులు శాంతించాక న్యాయం చేయడానికి వెళ్తాం

మీడియా చిట్‌ చాట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్‌

మూసీ బాధితులు శాంతించాక న్యాయం చేయడానికి వెళ్తాం
X

మూసీ బాధితులను బీఆర్‌ఎస్‌ రెచ్చగొడుతోందని.. ఆ రెచ్చగొట్టుడు కార్యక్రమం ముగిసి వాళ్లు శాంతించిన తర్వాతే తాము వాళ్లకు న్యాయం చేయడానికి వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం గాంధీ భవన్‌ లో ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. కేసీఆర్‌ సూచన మేరకే కిషన్‌ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారని, అలాంటి వ్యక్తి విమర్శలు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. కిషన్‌ రెడ్డిలో తెలంగాణ డీఎన్‌ఏ లేదని, ఉంటే రాష్ట్రానికి ఎంతో కొంత చేసేవారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కిషన్‌ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ రాష్ట్రానికి చేసిన మంచిపై అమరవీరుల స్తూపం వద్దకు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. అకాల వర్షాలు, వరదలతో రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లితే రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. మాజీ సర్పంచులు పొలిటికల్‌ ట్రాప్‌ లో పడొద్దని, వాళ్ల బిల్లులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్నారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాపంతోనే నేడు సర్పంచులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసని.. మార్చి నెలాఖరులోగా బకాయిలు చెల్లిస్తామని, అప్పటి వరకు ఓపిక పట్టాలన్నారు.

First Published:  4 Nov 2024 4:40 PM IST
Next Story