Telugu Global
Telangana

హైడ్రాకు 169 పోస్టులు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైడ్రాకు 169 పోస్టులు
X

హైడ్రాకు 169 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ క్యాడర్లలో ఈ పోస్టులను క్రియేట్‌ చేసింది. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్టింగ్‌ ఏజెన్సీ (హైడ్రా)కి ఈ పోస్టులు మంజూరు చేసింది. ప్రభుత్వంలోని ఆయా డిపార్ట్‌మెంట్‌లలో పని చేస్తున్న ఆయా క్యాడర్‌ ఉద్యోగులు డిప్యూటేషన్‌ పై హైడ్రాలో పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆల్‌ ఇండియా సర్వీస్‌ ర్యాంక్‌ ఆఫీసర్‌ హైడ్రా కు కమిషనర్‌ గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఐపీఎస్‌ ఆఫీసర్‌ రంగనాథ్‌ హైడ్రాకు కమిషనర్‌ గా ఉన్నారు. అడిషనల్‌ కమిషనర్‌ ఒకటి ఎస్పీ క్యాడర్‌ పోస్టు, స్టేట్‌ స్కేల్‌ పరిధిలోని ఎస్పీ ర్యాంక్‌ ఆఫీసర్లు మరో ముగ్గురు అడిషనల్‌ కమిషనర్‌ హోదాలో హైడ్రాలో పని చేయనున్నారు. ఐదు డీఎస్పీ క్యాడర్‌ పోస్టులు, 16 ఇన్‌ స్పెక్టర్‌, 16 సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ పోస్టులు, మూడు రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌, ఆరు రెవెన్యూ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌, రెండు సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ (కమ్యూనికేషన్స్‌), రెండు పోలీస్‌ కానిస్టేబుల్‌ (కమ్యూనికేషన్స్), 60 పోలీస్‌ కానిస్టేబుల్‌, ఒకటి ఎనలైటికల్‌ ఆఫీసర్‌, ఒకటి డిప్యూటీ అనలైటికల్‌ ఆఫీస్‌, రెండు అసిస్టెంట్‌ అనలైటికల్‌ ఆఫీసర్‌, ఒకటి రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఒకటి అడిషనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌, 12 స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఒకటి సిటీ ప్లానర్‌, మూడు డిప్యూటీ సిటీ ప్లానర్‌, ఒకటి ఇరిగేషన్‌ ఈఈ, మూడు ఇరిగేషన్‌ డీఈఈ, రెండు పబ్లిక్‌ హెల్త్‌ డీఈఈ, పది పబ్లిక్‌ హెల్త్‌ ఏఈ, ఒకటి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ సెక్టర్‌, ఒకటి డిప్యూటీ కలెక్టర్‌, మూడు తహశీల్దార్‌, మూడు సర్వేయర్‌, ఒకటి ఎస్‌ఆర్‌వో, మూడు సూపరింటెండెంట్‌, ఒకటి ఎఫ్‌ఆర్‌వో, ఒకటి పీఆర్‌వో, ఒకటి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సైంటిస్ట్‌ పోస్టులను హైడ్రా కోసం ప్రభుత్వం మంజూరు చేసింది.


పోస్టులు క్రియేట్‌ చేస్తూ ఇచ్చిన జీవో కోసం కింది లింక్‌ క్లిక్‌ చేయండి


First Published:  25 Sept 2024 7:00 PM IST
Next Story