Telugu Global
Telangana

మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వ అనుమతులు

హైదరాబాద్ మెట్రో రెండో ఫేజ్ పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వ అనుమతులు
X

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జీవో 196 జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,313 కోట్లను వెచ్చించనుంది.

కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లుగా ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. అయితే ఈ దశలో 4వ కారిడార్లో నాగోల్ - శంషాబాద్. 5వ కారిడార్లో రాయదుర్గం - కోకపేట్. ఇక అతిముఖ్యమైన 6వ కారిడార్లో ఎంజీబీఎస్ - చంద్రాయణగుట్ట మార్గాలు ఉండనున్నాయి. కాగా ఇప్పటికే ఆయా మార్గాల్లో స్థలసేకరణకు మెట్రో రైల్ సంస్థ ప్రకటన కూడా జారీ చేసింది.

First Published:  2 Nov 2024 6:09 PM IST
Next Story