గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్‌లా గవర్నర్ ప్రసంగం
20 శాతం కమీషన్ తప్ప.. విజన్ లేని ప్రభుత్వమిది అని కేటీఆర్ ఫైర్

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్‌లా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండ్ కేటీఆర్ సెటైర్ వేశారు. గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు చెబుతారని అనుకున్నాం. రైతులకు భరోసా ఇస్తారని భావించాం. 20-30 శాతానికి మంచి రైతులకు రుణమాఫీ జరగలేదు. కానీ.. పూర్తిగా చేసినట్లు గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. ఈ ప్రసంగంతో ఆయన స్థాయిని తగ్గించారు సీఎం రేవంత్ చేతకానితనం వల్ల అనేక ఎకరాలకు నీరు అందడం లేదు. 20 శాతం కమీషన్ తప్ప.. విజన్ లేని ప్రభుత్వమిది అని ఆరోపించారు. సాగునీటి సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలో కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలే, రైతు భరోసా రాలేదు, బోనస్ కు దిక్కు లేదునువ్వు నిరూపించుకో రేవంత్.. మేమంతా రాజీనామా చేస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు.కేసీఆర్ పై గుడ్డి ద్వేషంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు ఎండి పోయాయి. రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోయిన పొలాలకు సీఎం బాధ్యత వహించాలి. కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్ల 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు.పంటలు ఎండకుండా నీళ్లు వదులుతారని గవర్నర్ నోటి వెంట మాట వస్తాడని ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు. కాంగ్రెస్ చేసిన అప్పుల గురించి ప్రస్తావన లేదు. ఢిల్లీకి మూటలు పంపేందుకే ఈ ప్రభుత్వం ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. భారతదేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నా చేయడం బహుశా ఇదే మొదటిసారి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని మండిపడ్డారు. మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ నుండి మంచిగా మూట కట్టి గాంధీ భవన్‌కు పంపిస్తాం, ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అన్నారు.