Telugu Global
Telangana

రాజ్‌భవన్‌లో బతుకమ్మ సంబరాలు పాల్గొన్నా గవర్నర్ జిష్ణు దేవ్

రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొని తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్‌భవన్‌లో బతుకమ్మ సంబరాలు పాల్గొన్నా గవర్నర్ జిష్ణు దేవ్
X

రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొని తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గవర్నర్‌ సతీమణి సుధా దేవ్ వర్మ, మహిళలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలకు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.

మిగతా మహిళామణులతో కలిసి వివిధ రకాల నృత్యాలు చేస్తూ సందడి చేశారు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పెత్రమాసం తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలయ్యాయి. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టిపడింది. ఊరువాడా.. రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చి.. రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి.

First Published:  9 Oct 2024 8:41 PM IST
Next Story