Telugu Global
Telangana

కేసీఆర్‌ గురుతులు చెరిపేయాలనే గురుకులాలపై సర్కారు కుట్ర

రేవంత్ సంకుచిత మనస్తత్వంతో పేదింటిబిడ్డలకు చదువు దూరం చేస్తున్నడు : కేటీఆర్‌

కేసీఆర్‌ గురుతులు చెరిపేయాలనే గురుకులాలపై సర్కారు కుట్ర
X

కేసీఆర్‌ గురుతులు చెరిపేయాలనే గురుకులాలపై రేవంత్‌ రెడ్డి సర్కారు కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్ప్‌' వేదికగా మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు, ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేద వర్గాల ప్రజల బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఉదాతమైన లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించిదన్నారు. రేవంత్‌ రెడ్డి సంకుచిత మనస్తత్వంతోనే దళిత, గిరిజన, బడుగు, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాలను ఖతం పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాల్లోని 5వ తరగతిలో ఉన్న 41 వేల సీట్లకు 1.68 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే నేడు 51 వేల సీట్లకు గాను 80 వేలమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే దాదాపు 80 వేల మందికి పైగా తల్లిదండ్రులు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోలేదంటే గురుకులాలపై వారికి ఎంతగా నమ్మకం సన్నగిల్లిందో అర్థం అవుతుందన్నారు. ఏడాది క్రితం తెలంగాణ గురుకులాల్లో సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేదని.. ఇవాళ గురుకులాల్లో అడ్మిషన్ కావాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఆకలి చావులు, పాముకాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్ లతో 50కిపైగా విద్యార్థులు చనిపోవడమే ఇందుకు కారణమన్నారు. చదువు కంటే పిల్లల ప్రాణాలే తమకు ముఖ్యమని తల్లిదండ్రులు భావిస్తున్నారన్నారని, అందుకే ఎవరూ దరఖాస్తు చేయడం లేదన్నారు. గురుకులాలను పూర్వస్థితికి తెచ్చేంత వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు.

First Published:  16 Feb 2025 10:09 AM IST
Next Story