స్మిత సబర్వాల్‌కు కీలక బాధ్యతలు..!
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ కుమార్ ఈనెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రస్తుతం సీఎం కేసీఆర్ OSDగా పనిచేస్తున్న స్మిత సబర్వాల్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ కుమార్ ఈనెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అదనపు బాధ్యతలను సీఎం కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పునరావాసం, భూ సేకరణ విభాగం డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డైనమిక్ ఆఫీసర్‌గా పేరున్న స్మిత సబర్వాల్ గతంలో మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షించారు. మార్కెటింగ్ శాఖలోనూ పనిచేశారు. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి అని పేరు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ స్మిత సబర్వాల్‌కు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.